Sunitha Upadrashta: 'బ్లెస్డ్'అంటూ సింగర్ సునీత పోస్ట్.. దీని వెనుక అర్థం అదేనా..?
Sunitha Upadrashta: సునీత పెళ్లి కూడా చాలా చిన్న వయసులోనే జరిగింది. మీడియాలో పనిచేసే వ్యక్తితో సునీత వివాహం జరిగింది.;
Sunitha Upadrashta (tv5news.in)
Sunitha Upadrashta: తెలుగులో ఎంతోమంది సింగర్స్ ఎన్నో ఏళ్లుగా మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అందులో స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పేరు సునీత. మధురమైన గాత్రం ఆమె సొంతం. సింగర్‌గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎంతోమంది హీరోయిన్ల పాత్రలకు ప్రాణం పోశారు సునీత. అయితే సునీత ఇటీవల పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది.
సునీత చాలా చిన్న వయసు నుండే సంగీతం నేర్చుకున్నారు. 13 ఏళ్ల వయసు వచ్చేసరికే సునీత ఎన్నో సంగీత కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. సునీత పెళ్లి కూడా చాలా చిన్న వయసులోనే జరిగింది. మీడియాలో పనిచేసే కిరణ్ కుమార్ గోపరాజుతో సునీత వివాహం జరిగింది. వారికి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు.
పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకున్నారు సునీత. ఆ తర్వాత చాలాకాలం పాటు తన కెరీర్‌పైనే దృష్టిపెట్టారు. ఇక 2021లో వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇటీవల 'బ్లెస్డ్' అనే క్యాప్షన్‌తో సునీత ఓ మామిడి చెట్టు దగ్గర మామిడికాయను పట్టుకొని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోకు అర్థం ఏమిటా అని నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సునీత ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.