సన్నీ డియోల్ హీరోగా రణ్ దీప్ హుడా, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జాట్ కు సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ మేరకు టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. బాలీవుడ్ కు గోపీచంద్ మార్క్ మాస్ టేకింగ్, మేకింగ్ విపరీతంగా నచ్చింది. ఊరమాస్ ఆడియన్స్ ను మరింత ఎంటర్టైన్ చేసింది జాట్. అందుకే ఈ మూవీ 7 రోజుల్లో 70 కోట్లకు పైగా వసూలు చేసి సన్నీడియోల్ కు ఈ ఏజ్ లోనూ బ్లాక్ బస్టర్ అందించింది. అందుకే ఈ చిత్రానికి మరో భాగం కూడా రూపొందించాలనుకున్నారు.
ఇక ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించిన వార్తను సన్ని డియోల్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం విశేషం. మరి ఇది జాట్ కు సీక్వెల్ గా ఉంటుందా లేక ఈ హిట్ టైటిల్ పెట్టుకుని కొత్త కథతో వస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అప్పుడే ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయ్యాయట. మరోవైపు గోపీచంద్ తెలుగులో బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. మరి జాట్ 2 బాలయ్య మూవీ తర్వాత ఉంటుందా లేక జాట్ 2 తర్వాత బాలయ్య మూవీ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.