Dominic Arun Lokah : 200 కోట్ల క్లబ్ లోకి సూపర్ విమెన్ మూవీ

Update: 2025-09-09 07:45 GMT

ఏ సినిమా ఎప్పుడు ఎంతటి విజయం సాధిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. ఎక్స్ పెక్ట్ చేసినా కొన్నిసార్లు ఆ ఊహలు తప్పుతుంటాయి. మొన్నటి వరకూ మళయాల మూవీ ‘లోకా’ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మహా అయితే మాలీవుడ్ లో హిట్ అవుతుందనుకున్నారు. బట్ ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ ఫస్ట్ మాలీవుడ్ సూపర్ విమెన్ మూవీ హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లోనూ అదరగొడుతోంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం సౌత్ మొత్తం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్నవాళ్లందరికీ కాసులు కురిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఓ మాలీవుడ్ మూవీ ఈ రేంజ్ వసూళ్లు సాధించడం అనేది.. అది కూడా సూపర్ విమెన్ స్టోరీతో అంటే అది అనూహ్యం అనే చెప్పాలి.

డోమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన లోకాను తెలుగులో కొత్త లోకా పేరుతో డబ్ చేశారు. కళ్యాణి ప్రియదర్శన్, నాస్లేన్, శాండీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తెలుగులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వసూళ్లు సైతం ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అతి తక్కువ టైమ్ లోనే 200 కోట్ల మార్క్ ను టచ్ చేయడం చూసి మాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోంది. ఇప్పటి వరకూ అక్కడ మోహన్ లాల్ మూవీస్ తో హయ్యొస్ట్ కలెక్షన్స్ లో హవా. బట్ లోకా మాలీవుడ్ హయ్యొస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అంటోంది అక్కడి ట్రేడ్. ఏదేమైనా ఈ మూవీతో కళ్యాణి మార్కెట్ కూడా మరో స్థాయికి వెళుతుంది. అటు దర్శకుడు కూడా టాక్ ఆఫ్ ద సౌత్ గా మారాడు. పైగా ఈ లోకా ఫ్రాంఛైజీ దాదాపు ఏడు సినిమాల వరకూ కొనసాగుతుందని కూడా ఆల్రెడీ చెప్పారు. కాబట్టి డోమినిక్ అరుణ్ కు ఫ్యూచర్ లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ గ్యారెంటీ అనుకోవచ్చు. 

Tags:    

Similar News