రాత్రి అస్వస్థతకు కు గురైన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రజనీకాంత్‌కు వైద్యులు చికిత్స అందించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి.
మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో కూడా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ వేట్టయాన్, కూలీ చిత్రాల్లో రజనీ నటిస్తున్నారు. వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది.