Video Viral: అందమైన జంటకు సూరత్ నగల వ్యాపారి అదిరిపోయే గిప్ట్..
Video Viral: రణబీర్-ఆలియా కోసం సూరత్‌కు చెందిన నగల వ్యాపారి ఈ పుష్పగుచ్ఛాన్ని పంపారు.
Video Viral: బాలీవుడ్‌లో గోల్డెన్ కపుల్‌గా పేరుగాంచిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వివాహ వేడుక ప్రారంభంకాగానే.. వారి అభిమానులు వారికి శుభాకాంక్షలు, బహుమతులు పంపుతున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో రణబీర్-ఆలియా బంగారు పూత పూసిన పుష్పగుచ్ఛాన్ని బహుమతిగా పొందారు అని. రణబీర్-ఆలియా కోసం సూరత్‌కు చెందిన నగల వ్యాపారి ఈ పుష్పగుచ్ఛాన్ని పంపారు. లక్షన్నర విలువైన ఈ పుష్పగుచ్ఛం ఐదు అడుగుల ఎత్తు ఉంది.
నగల వ్యాపారి కుటుంబ సభ్యులకు అలియా, రణబీర్‌లు అంటే విపరీతమైన అభిమానం. అందుకే గోల్డెన్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్‌లకు ప్రత్యేకంగా గోల్డెన్ ఫాయిల్ రోజ్ బొకే పంపారు.
ఆభరణాల వ్యాపారి దీపక్ చోక్సీ మాట్లాడుతూ, తమ కుటుంబం మొత్తం ఈ జంటను అభిమానిస్తాం. అందుకే మా వైపు నుంచి అలియా, రణ్‌బీర్‌లకు ప్రత్యేక బహుమతి పంపాలి అని అనుకున్నాము. ఇంతకుముందెన్నడూ తయారు చేయని విభిన్నమైన గోల్డెన్ రోజ్ బొకేని తయారు చేశాం.
మేము ఈ బోకేని 5-6 రోజుల్లో సిద్ధం చేసాము. ఈ పుష్పగుచ్ఛంలో 125 కంటే ఎక్కువ బంగారు రేకు గులాబీలను ఉపయోగించాము. వారికి ఈ పుష్పగుచ్ఛం చాలా నచ్చిందని తెలిసి నేను చాలా ఆనందించాను. మా అభిమాన నటీనటులకు గుర్తుండిపోయే బహుమతి పంపినందుకు మా కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తున్నారు అని దీపక్ చోక్సీ అన్నారు.