Suriya 42 : పది భాషల్లో, 3డీ వర్షెన్‌లో సూర్య 42వ చిత్రం..

Suriya 42 : సూర్య కెరీర్‌లో 42వ చిత్రంగా నిలవనుంది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు

Update: 2022-09-09 16:13 GMT

Suriya 42 : కోలివుడ్ దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది సూర్య కెరీర్‌లో 42వ చిత్రంగా నిలవనుంది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఆయుధాలన్నీ ధరించి ఓ కొండచివరన సూర్య నిలబడినట్లు వెనక నుంచి చూపిస్తారు. ఓ గద్ద ఎగురుకుంటూ వచ్చి భూజంపై వాలుతుంది.

మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో కథ ఉన్నట్లు మోషన్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. మూవీ పేరు, ఇతర క్యారెక్టర్స్ వివరాలను ఇంకా బయటపెట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్, కేఈ జ్ఞానవెల్‌రాజ నిర్మిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News