Suriya : రోలెక్స్ వస్తున్నాడు

Update: 2025-02-25 08:00 GMT

కొన్ని సినిమాల్లో హీరోల కంటే కేమియోలే హైలెట్ అవుతాయి. అఫ్ కోర్స్ హీరోతో పాటుగా ఆ రేంజ్ లో కేమియో వర్కవుట్ అయిన సినిమా విక్రమ్. కేమియోగానే కనిపించినా అదో ఫుల్ లెంగ్త్ రోల్ అవుతుందని అంతా పసిగట్టేశారు. ఇక దర్శకుడికి తెలియదా.. అందుకే ఆ పాత్రతోనూ ఓ సినిమా లాగించేస్తా అని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు చేయబోతున్నాడు.

విక్రమ్ మూవీలో రోలెక్స్ పాత్ర గురించి కొత్తగా చెప్పేదేముందీ.. సినిమా అంతా కమల్ హాసన్ ఓ రేంజ్ లో అదరగొడితే.. చివరి 10 నిమిషాల్లో సూర్య షేక్ చేశాడు. ఇప్పటి వరకూ ఖైదీ, విక్రమ్ మూవీస్ లో విలన్ ఎవరై ఉంటారా అనుకునేవాళ్లకు రోలెక్స్ ను చూపించాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. అతని సినీవర్స్ లో రోలెక్స్ ఓ క్రేజీ క్యారెక్టర్ అయిపోయింది. పైగా ఆ పాత్ర చేసింది సూర్య కావడంతో ఫ్యాన్స్ లోనూ ఓ కిక్ కనిపించింది. ఈ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారి కోసమే ఈ న్యూస్.

లోకేష్ కనకరాజ్, సూర్య కాంబోలో మూవీ 2026 ఆరంభంలో స్టార్ట్ అవుతుందట. ఈ చిత్రానికీ అనిరుద్ సంగీతం అందిస్తాడు. ప్రస్తుతం సూర్య రెట్రో, వాడివాసలైతో పాటు రెండు తెలుగు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు. అటు లోకేష్ ప్రస్తుతం కూలీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని తర్వాత ఖైదీ 2 ఉంటుంది. లోకేష్ ఖైదీ 2 పూర్తి చేసే టైమ్ కు సూర్య డేట్స్ సెట్ అవుతాయట. అందుకే ఈ మోస్ట్ అవెయిటెడ్ కాంబోలో మూవీ 2026లోనే వస్తుందని చెబుతున్నారు. మరి రోలెక్స్ థియేటర్స్ లో చేసే ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే అంచనాలు వేసేయండి. 

Tags:    

Similar News