ఆస్కార్ బరిలో 'ఆకాశమే నీ హద్దురా'..
సూర్య కీలక పాత్ర పోషించగా, అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్ మరి కొన్ని ప్రధాన పాత్రల్లో నటించారు.;
విమానం ఎక్కాలన్న సామాన్యుడి కలను నెరవేర్చే అంశంతో సుధా కొంగర తెరకెక్కించిన తమిళ చిత్రం సురారై పొట్రు.. ఓటీటీలో రిలీజై సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఈ చిత్రం ఆస్కార్‌కు పోటీపడనుంది. జనరల్ క్యాటగిరీలో ఈ సినిమా పోటీపడుతోంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టతో పాటు మరికొన్ని కేటగిరీల్లో ఈ సినిమా పోటీ పడుతోంది.
తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి నిరాజనం పట్టారు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందించారు. సూర్య కీలక పాత్ర పోషించగా, అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్ మరి కొన్ని ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయిన విషయం ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ మ్యాజిక్ కోసం.. ఆస్కార్ జనరల్ క్యాటగిరీలో పోటీపడనున్నట్లు పాండియన్ తెలిపారు. తమ సినిమాకు అకాడమీలో గ్రీన్ సిగ్నల్ దక్కిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది.