Mouni Roy : ఇండస్ట్రీలో టాలెంట్ సరిపోదు : మౌనీ రాయ్

Update: 2025-08-11 06:00 GMT

‘నాగిని' సీరియల్ పాపులారిటీ సంపాదించుకున్న నటి మౌనీ రాయ్. బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' హిందీ మూవీతో బాలీవు డ్లోకి అడుగుపెట్టింది. తొలి మూవీకి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది. ఇటీవలే విడుదలైన హారర్ కామెడీ మూవీ 'ది భూ త్నీ'లోనూ మెరిసింది. ఇక మౌనీరాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది! విశ్వంభర మూవీలో ఈ నటి మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్త యింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మౌనీ రాయ్ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. వినోద పరిశ్రమలో బయటి వ్యక్తులు ఎదుర్కొంటో న్న సవాళ్ల గురించి ప్రస్తావించింది. 'బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్న. కానీ అది నిజ మవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా! ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోతే మనం ఎంత పెద్ద సినిమాలో నటించినప్పటికీ నో యూజ్. బయటి వ్యక్తులకు చాన్స్లు ఇవ్వరు. వీటి కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. అందుకే నేను చిన్న ఆఫర్ వచ్చినా ఉపయోగించుకుంటా. నేను ఇన్ని మూవీల్లో చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఆడిషన్స్ ఇస్తూనే ఉంట' అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News