Tamanna : అందుకే నో కిస్ రూల్ ను పక్కన పెట్టేశా : తమన్నా

Update: 2025-08-18 08:45 GMT

తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన అందాల భామ తమన్నా భాటియా . గతేడాది ఏకంగా 4 సినిమాలతో వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వరుస హిట్స్ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే ఓదెల-2 మూవీతో ప్రేక్షకులను అలరించింది, ఇక ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అయితే తాజాగా ఈ మిల్కీ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను కస రత్తు చేయడం ప్రారంభించి చాలా కాలం అయ్యింది. ఆహారం, పని, వ్యక్తిగత ఇష్టాలు ఇలా ఏదైనా బలవంతంగా చేయను. నాకు అలసటగా ఉన్నా.. సరిగ్గా నిద్ర లేకపోయినా, కసరత్తులు చేయకుండా రెస్ట్ తీసుకుంట. విరామ సమయాల్లో ఏదైనా ప్రశాంత ప్రదేశానికి వెళ్తా. అక్కడ అన్నీ మరిచి ధ్యానం చేస్త. అదే విధంగా దేవాలయాలకు వెళ్లడానికి ఇష్టపడతా. అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతోపాటు మంచి అనుభవాన్నిస్తుంది. సమీప కాలంలో కాశీ పయనాన్ని మరచిపోలేను. అది నా మనసును ఎంతగానో ఆకట్టుకుంది. నన్ను గ్లామరస్ నటిగా ముద్ర వేశారు. అయితే స్టార్టింగ్లో కొన్ని కట్టుబాట్టు విధించుకున్న. అందుకే చాలెంజ్తో కూడిన, శక్తివంతమైన కథా చిత్రాలను కోల్పోయాననే భావన కలిగింది. అందుకే నో కిస్ రూల్ ను పక్కన పెట్టేశా' అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News