Jailer : పూర్తిగా న్యాయం చేయలే

Update: 2024-12-05 12:30 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ 'జైలర్', వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇందులో 'కావాలయ్యా' అనే స్పెషల్ సాంగ్ లో తమన్నా కనిపించి తన డ్యాన్స్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. దీంతో ఈ పాటకు వరల్డ్ వైడ్ గా ఎంతో గుర్తింపు వచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో కావాలయ్యా పాటపై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'కావాలయ్యా పాటకు నేను పూర్తిస్థా యిలో న్యాయం చేయలేకపోయను. నేను పూర్తిగా భాగస్వామ్యం కాలే కపోయాననే బాధ నాకు ఉంది. ఈ సాంగ్ ను ఇంకా మెరుగ్గా షూట్ చేయొచ్చని ఆలోచన నాకు కలిగింది' అంటూ చెప్పుకొచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమన్నాతో కలిసి ఈ పాటలో డ్యాన్స్ చేశారు. కానీ అనుకున్నంతగా డ్యాన్స్ చేయలేకపోయానని తన మనసులోని మాట చెప్పిన విషయం తెలిసిందే. ఏదేమైనా జైలర్ మూవీ సక్సెస్ లో కావాలయ్యా పాట కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించింది.

Tags:    

Similar News