Tamil Actor in Telugu Bigg Boss : తెలుగు బిగ్ బాస్లోకి తమిళ హీరో

Update: 2024-07-26 15:53 GMT

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. ఇప్పటికే విజయవంతంగా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదవ సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. ఇటీవలే కొత్త సీజన్ కు సంబందించిన లోగోను విడుదల చేశారు మేకర్స్. అయితే.. హోస్ట్ మార్పుపై వస్తున్న రూమర్స్ ను కొట్టిపారేస్తూ.. ఎనిమిదవ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేయనున్నట్లు క్లారిటీ ఇస్తూ.. ఆయన సోషల్ మీడియా కథ నుండే సీజన్ 8 లోగోను విడుదల చేశారు. ఈ వీడియోకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక అప్పటినుండి.. ఈ సీజన్ లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరా అని తెలుసుకునేందుకు ఉత్సవాహం చూపిస్తున్నారు ఆడియన్స్. ఇందులో భాగంగానే తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సీజన్ ను ఎలాగైనా భారీ విజయం సాధించేలా చేయాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ టీమ్ అందుకే ఫేమ్ ఉన్న సెలబ్రెటీలను ఈ సీజన్ కోసం దింపుతున్నారట. వారిలో తమిళ నటుడు అబ్బాస్ కూడా ఉండనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ సినీ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా తనదైన ముద్రవేసుకున్నాడు హీరో అబ్బాస్. అలా వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కానీ, ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం న్యూజీలాండ్ లో తన ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు అబ్బాస్. ఇక గత సీజన్ తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ నటుడు.. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని తేలుస్తోంది.

Tags:    

Similar News