Simbu : తెలుగు రాష్ట్రాలకు శింబు వరద సాయం

Update: 2024-09-11 09:30 GMT

తమిళ చిత్రాల కథానాయకుడు శింబు మరోసారి తన ఉదారతను చాటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితుల సహాయం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు.

వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో శింబు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా ఆరు లక్షల విరాళం ప్రకటించారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో బాధ కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు.

Tags:    

Similar News