Tanya Ravichandran : ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే... స్టార్ హీరో మనవరాలు..!
Tanya Ravichandran: యంగ్ హీరో కార్తీకేయ నటిస్తోన్న తాజా చిత్రం 'రాజావిక్రమార్క'.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను పెంచేశాయి.;
Tanya Ravichandran: యంగ్ హీరో కార్తీకేయ నటిస్తోన్న తాజా చిత్రం 'రాజావిక్రమార్క'.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను పెంచేశాయి. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది హీరోయిన్ తాన్యా రవిచంద్రన్.
ఈమె గురించి తెలుగు ఆడియన్స్‌కి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఈమె బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దదే.. తమిళ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలే ఈ తన్యా రవిచంద్రన్.. కుటుంబం అంతా సినిమా నేపధ్యం కావడంతో చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి ఉండేదట.అలా సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయిందట.. అయితే ముందు చదువుపై దృష్టి పెట్టమని ఆమె అమ్మానాన్నలు చెప్పడంతో ఎంట్రీ కాస్త ఆలస్యమైందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది తాన్య.
2016లో 'బల్లె వెళ్ళయ్యతేవా' అనే తమిళ చిత్రంతో తన్యా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తాన్య.. ఇప్పటివరకు ఆమె మొత్తం అయిదు సినిమాల్లో నటించింది... సినిమాల కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటోంది ఈ బ్యూటీ. ఇక తన తాతయ్యా రవిచంద్రన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.. దురదృష్టవశాత్తూ తన ఎంట్రీ చూడకుండానే ఆయన దూరం అయ్యారని భావోద్వేగానికి లోనయ్యింది.
కాగా తన క్యూట్ క్యూట్ స్మైల్‌తో కుర్రకారు మతి పోగోడుతోంది తాన్య.. సోషల్ మీడియాలో కూడా ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.