హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన కాంతార సిరీస్ దేశవ్యాప్తంగా భారీ హైపన్ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2018లో వచ్చిన ఫస్ట్ పార్ట్ తర్వాత కాంతార ప్రీక్వెల్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ ప్రీక్వెల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ‘కాంతార 3'కి సంబంధించి హాట్ టాపిక్ వె లుగులోకి వచ్చింది. ఈమూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీ రోల్లో నటించబోతున్నాడని, ఆ పాత్ర చిత్రానికి భారీగా క్రేజ్ తీసుకొచ్చేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ఇప్ప టికే తారక్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ స్టేజీలోనే ఎన్టీఆర్ పేరు ఫిక్స్ అయిందని సమాచారం. రిషబ్ శెట్టి కూడా తన కథకు ఎన్టీ ఆర్ అయితే బెస్ట్ అని భావిస్తున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ కాంబినేషన్ సెట్టయితే బాక్సాఫీసు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ చేస్తున్నారు.