Akhanda 2 : అఖండ 2 టికెట్ ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2025-12-04 10:25 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ అఖండ 2. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది ఈ మూవీ. అయితే ఒక రోజు ప్రీమియర్స్ వేయడం విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది. అలాగే టికెట్ ధరలు కూడా పెంచబోవడానికి ఓకే చెప్పాలి అనుకుంది. కానీ 4వ తారీఖున జి.వో ఇవ్వడం విషయంలో మాత్రం బాగా తాత్సారం చేసింది ప్రభుత్వం. దీంతో అభిమానుల్లో గందరగోళం కనిపించింది. బట్ ఫైనల్ గా ఈ జి.ఓ వచ్చింది. అఖండ 2 టిక్కెట్లు ధరలపై జి.ఓ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

4వ తారీఖున ప్రీమియర్ షో కోసం 600 రూపాయలు టికెట్ ధర నిర్ణయించింది. 5వ తారీఖున మాత్రం మూడు రోజుల పాటు మల్టీ ప్లెక్స్ ల్లో ఒక్కో టికెట్ పై 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సో.. ప్రీమియర్స్ గా 4వ తారీఖున 600 టికెట్, 5న మల్టీ ప్లెక్స్ ల్లో 400 లు, సింగిల్ స్క్రీన్స్ పై 200 నుంచి 250 రూపాయల వరకు టికెట్ ధరలు పెంచే అవకాశం కల్పించింది. 

Tags:    

Similar News