Actor Manoj Emotional Post : తెలుగు దర్శకుడు అజయ్ మృతి.. హీరో మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా’ మూవీ దర్శకుడు అజయ్ మృతి చెందారు. హీరో మనోజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ ఇక లేరు. ఈ విషయం చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయావు అజయ్. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇది ఒక కల కావాలని కోరుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా బాబాయ్’ అని మనోజ్ Xలో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అజయ్ శాస్త్రి.. డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన 'రాఖీ', 'డేంజర్' చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. 2008లో 'నేను మీకు తెలుసా?' మూవీతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా ఫెయిల్ కావడంతో మరో ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత ఏమైపోయారో ఎక్కడున్నారనే విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు మనోజ్ ట్వీట్‌తో అజయ్ చనిపోయిన విషయం బయటపడింది.