Kandikonda : సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
Kandikonda : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు.. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.
Kandikonda :ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి అకాల మరణం చెందారు.. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.. దాదాపు రెండేళ్లపాటు ఆయన క్యాన్సర్‌తో బాధపడ్డారు.. కందికొండ అకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక మంచి రచయితను కోల్పోయినట్లయింది.. అటు కందికొండ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు కొందికొండ.. ఉస్మానియాలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, విశిష్టతను తెలియజేసేలా ఎన్నో పాటలు రాశారు.. కందికొండ రాసిన బోనాల పాటకు ఎంతో ఆదరణ వచ్చింది.. కందికొండ కలం నుంచి ఎన్నో మధురమైన పాటలు జాలువారాయి.. కందికొండను చక్రినే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు..
ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం సినిమాలో మళ్లి కూయవే గువ్వా పాటతో ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టారు. దేశముదురు, అమ్మా నాన్నఓ తమిళమ్మాయి, పోకిరి, మున్నా సహా అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు. చివరిగా 2018లో నీది నాది ఒకే కథలో రెండు పాటలు రాశారు..