సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'సిగ్మా'. ఈ మూవీని డైరెక్ట్ చేస్తోన్న హీరో విజయ్ తళపతి తనయుడు జాసన్ సంజయ్. యస్.. సంజయ్ దర్శకుడుగా మారుతున్న సినిమా ఇదే. దీనికి హీరోగా సందీప్ కిషన్ ను ఎంచుకున్నాడు అని గతంలోనే ప్రకటించాడు సంజయ్. తాజాగా ఈ చిత్రానికి సిగ్మా అనే టైటిల్ ను అనౌన్స్ చేశాడు. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. సందీప్ కు కూడా కలిసొచ్చేలా ఉంది టైటిల్. అయితే ప్రస్తుతం సందీప్ కిషన్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయినా అతని సినిమా ఎంచుకోవడం మాత్రం విశేషం అనే చెప్పాలి.
ఇక ఈ చిత్రానికి ఇప్పటికే 95 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేశారట. యాక్షన్, అడ్వెంచరస్, కామెడీ కూడా మిక్స్ అయిన చిత్రంగా రాబోతోందట. ఈ మేరకు అన్ని అంశాలు కూడా ఉన్నట్టు చెప్పేలా దర్శకుడు సంజయ్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక హీరోయిన్ గా తెలుగు బ్యూటీ ఫారియా అబ్దుల్లా నటించబోతోంది. అలాగే రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందబోతోంది. మొత్తంగా ఈ మూవీతో జాసన్ సంజయ్ సంచలనం సృష్టించబోతున్నాడు అని చెప్పబోతున్నాడేమో.