Rashmika : థాంక్యూ అలియా.. రష్మిక ప్రశంసల వర్షం

Update: 2024-10-11 15:00 GMT

బాలీవుడ్‌ నటి అలియాభట్‌పై నటి రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్నమైన కథలను తరచూ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.‘అలియా భట్‌, వేదాంగ్‌ నటించిన ‘జిగ్రా’ చూశా. సినిమా అద్భుతంగా ఉంది. నటీనటులు, చిత్రబృందాన్ని గట్టిగా హత్తుకుని మెచ్చుకోకుండా ఉండలేకపోయా. అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు థాంక్యూ. వేదాంగ్‌ నువ్వు మరెన్నో చిత్రాలు నటిస్తే చూడాలనుకుంటున్నా. రాహుల్‌.. నువ్వు నన్నెంతో సర్‌ప్రైజ్‌ చేశావు. నీకు, ‘జిగ్రా’లో నువ్వు పోషించిన మత్తు పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్‌ బాలా.. మేకింగ్ చాలా బాగుంది. ఇంకెన్నో విషయాలు చెప్పాలని ఉంది. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని రష్మిక రాసుకొచ్చారు.

Tags:    

Similar News