మిస్ యూనివర్స్ కిరీటం అందుకొని బాలీవుడ్ లో స్థిరపడ్డ నటి సుస్మితా సేన్. తన అందచందాలతో అలరించడమే కాకుండా.. బోల్డ్ స్టేట్మెంట్స్ , జిమ్ లో కసరత్తులు చేస్తూ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్ గా నిలిచిన నటీమణి ఈమె. ఒకప్పుడు చావు అంచులదాక వెళ్లి వచ్చింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే, ఎనర్జిటిక్ గా కనిపించింది. మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకునేదట. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2014 నుంచే ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ డిసీజ్తో బాధపడుతున్నటు వెల్లడించింది. ఆమె శరీరంలో కార్డిసోల్ అనే హర్మోన్ ఉందని తేలిందట. ఇది ప్రాణాంతకమైందని, సరిచేయాలంటే.. ప్రతి 8 గంటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేయాలని వైద్యులు చెప్పారట. వ్యాయామాలు, బరువైన పనులు చేయకూడదన్నారట. ఒక సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దుబాయ్ నుంచి అబుదబీ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత టర్కీ వైద్యులు ఫోన్ చేసి సుష్మితా జీవితంలో మీ రాకిల్ జరిగిందని చెప్పాడట. తన అడ్రిల్ గ్రంధి ఇప్పుడు సవ్యంగా పని చేస్తుందన్నారట. ఇకపై ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని చె ప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పు కొచ్చింది సుస్మిత.