Harish Shankar : అందుకే పిల్లలు వద్దనుకున్నా: హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు
‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బాధ్యతల కోసం పిల్లలను వద్దనుకున్నట్లు చెప్పారు. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన భార్య సపోర్టుతో చెల్లెలికి పెళ్లి, తమ్ముడిని సెటిల్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలు ఉంటే స్వార్థంగా బతుకుతామని ఆలోచించి తన భార్యతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీటితోనే తాను పూర్తిగా అలిసిపోయానని... మళ్లీ అలాంటి బాధ్యతలు వద్దనుకున్నామని తెలిపారు. పిల్లలు ఉంటే స్వార్థంగా తయారవుతామని... అన్నిటికీ అడ్జస్ట్ అయి బతకాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే తాము పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావన తెచ్చారు హరీష్. మోడీ మూడుసార్లు విజయం సాధించడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం కూడా ఒక కారణమేనని అన్నారు. ఒక వ్యక్తి పిల్లలు లేకుంటే నిస్వార్థంగా, బాదరబందీలకు లోనికాకుండా పనిచేయగలడు అనే భావన ప్రజల్లో ఉంది. మోడీ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. తన భార్య ఓ డాక్టర్ అని తనకు సినిమాలంటే ఇష్టముండదని తెలిపారు హరీష్. తాను సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటానో కూడా ఆమెకు తెలియదన్నారు. హరీశ్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.