ఊరు మధ్య చిచ్చు పెట్టిన ‘కమిటీ కుర్రోళ్లు’

Update: 2024-07-26 13:42 GMT

చిన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ మధ్య వచ్చిన మ్యాడ్ అనే మూవీ కేవలం కామెడీతోనే కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. అందులో పేరున్న ఆర్టిస్టులు కూడా లేరు. అంతా కుర్రాళ్లే. అలాంటి కొత్త కుర్రాళ్లతో వస్తోన్న సినిమానే ‘కమిటీ కుర్రోళ్లు ’. యధు వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నిహారిక కొణెదల నిర్మించడంతో కాస్త ఎక్కువ ఫేమ్ వచ్చింది. దీనికి తోడు ఈ కుర్రాళ్లంతా ముందు నుంచీ వెరైటీ ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ చూసినప్పుడే విషయం ఉందనిపించింది. లేటెస్ట్ గా ట్రైలర్ విడుదలైంది.

చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న కొందరు ఫ్రెండ్స్ పెద్దయ్యాక మద కేటగిరీ( క్యాస్ట్ ) తెలిసిన తర్వాత వారి మనస్తత్వాలు ఎలా మారిపోతాయి.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటీ అనే నేపథ్యంలో కనిపిస్తోంది. ఆ నేపథ్యంగా ఆ ఊరిలో 12యేళ్లకు ఓ సారి వచ్చే జాతర నిలుస్తోంది. ఈ జాతరలో చిన్ననాటి ఫ్రెండ్స్ వర్గాలుగా విడిపోతారు. తద్వారా ఆ ఊరిలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి అనే కోణంలో ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోందీ ట్రైలర్ చూస్తుంటే.

టైటిల్ చూసి మొదట ఇది కూడా మ్యాడ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనుకున్నారు చాలామంది. కానీ ఇందులో కంటెంట్ వేరే ఉన్నట్టుగా కనిపిస్తోంది. దర్శకుడు సొంత ఐడియాలజీతో పాటు సామాజిక సమస్యలపై అవగాహనతోనే మూవీ రూపొందించినట్టు అర్థం అవుతోంది. అందుకే కాస్త ఎమోషనల్ గానూ ఉందీ ట్రైలర్. ఆగస్ట్ 9న విడుదల కాబోతోన్న ఈ కమిటీ కుర్రోళ్లకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. 

Tags:    

Similar News