మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సప్త సముద్రాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మళయాలం నుంచి టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది.
ఫస్ట్ డేనే 200 మందికి పైగా ఆర్టిస్టులతో ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సెట్ లో అడుగుపెట్టడానికి ఎన్టీఆర్ కు ఇంకాస్త టైమ్ ఉందట. అయితే ఈ షెడ్యూల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ఉంటుందని టాక్. ఇక షూటింగ్ కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తయింది. అంటే ఎన్టీఆర్ కు సంబంధించిన పోర్షన్ అంతా కంప్లీట్ అయింది. ఇక ప్రశాంత్ నీల్ మూవీపైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు.