కొన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆకట్టుకుంటాయి. అలా ఈ మధ్య కాలంలో చూసిన ప్రతి ఒక్కరి మనసులను కదిలించిన సినిమా మహారాజ. విజయ సేతుపతి హీరోగా నటించిన ఈమూవీలోని ట్విస్ట్ లకు చాలామంది సర్ ప్రైజ్ అయినా.. ఓ సోషల్ ఇష్యూను చాలా ప్రభావవంతంగా చెప్పాడు దర్శకుడు నిథిలన్ సామినాథన్. ఈ కథ కోసం అతను చాలా టైమ్ వెచ్చించానని చెప్పాడు. ఆ కథ నచ్చే విజయ్ సేతుపతి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేశాడు. దీంతో కేవలం 20 కోట్లలోనే మూవీని రూపొందించాడు నిథిలన్. కట్ చేస్తే మహారాజు ఏకంగా 109 కోట్లు వసూలు చేసి వారెవా అనిపించింది.
ఇలాంటి మ్యాజికల్ హిట్స్ కొట్టే దర్శకులకు ఆఫర్స్ వెంట వెంటనే వస్తాయి కదా. బట్ నిథిలన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాణి అనే టైటిల్ తో మరో కథను సిద్ధం చేసుకున్నాడు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. మరి ఆ సినిమాలకు కోలీవుడ్ లో బ్రాండ్ అంటే నయనతారే కదా. అందుకే ఆమెనే ఈ కథతో అప్రోచ్ అయ్యాడట. అందుకోసం విజయ్ సేతుపతి హెల్ప్ కూడా తీసుకున్నాడని టాక్. ఆల్రెడీ నయన్ కు స్టోరీ వినిపించాడని.. తనకు బాగా నచ్చిందని.. త్వరలోనే ఈ కాంబోలో మహారాణి అనే టైటిల్ తో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని కోలీవుడ్ లో టాక్. మొత్తంగా మహారాజ దర్శకుడు ఈ సారి మహారాణితో రాబోతున్నాడన్నమాట.