Samantha : అమ్మ అనే అనుభూతి అద్భుతం : సమంత

Update: 2024-11-13 14:30 GMT

అమ్మతనంలో ఉండే మాధుర్యమే వేరు. బిడ్డను లాలించి.. ఊరించి.. బుజ్జగించి.. చిలిపి చేష్టలను ఎంజాయ్ చేయడం.. వాళ్లు ప్రయోజకులయ్యే వరకు మార్గదర్శిగా అదో అందమైన బాధ్యతాయుత అనుభూతి. స్టార్ హీరోయిన్ సమంతకు తల్లి కావలనుందంటోంది. ఎప్పటికైనా తల్లినవుతానని చెబుతోంది. సిటాడెట్ హనీబన్నీ వెబ్ సిరీస్ లో ఓ పాపకు తల్లిగా నటించిన సమంత.. నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 'సిటాడెల్లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది. తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు. తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది. గతంలో హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది.

Tags:    

Similar News