నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. పుష్ప -2 సినిమా రిలీజ్ తర్వాత రష్మిక పై క్రేజీ మరింత ఎక్కవైంది. పుష్ప సినిమాలో పెర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప టు ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సినిమా చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని రష్మక పాత్రకు సంబంధించిన టీజర్ ను డిసెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.