The Hunt : ‘ది హంట్‌: రాజీవ్ గాంధీ హ‌త్య కేసు’

Update: 2025-06-18 14:50 GMT

ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం సోనీ లివ్‌, అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కుకునూర్ మూవీస్‌తో క‌లిసి, ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్‌ జ‌ర్న‌లిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్త‌కం నైంటీ డేస్ ఆధారంగా ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ అనే ఉత్కంఠ‌భ‌రిత పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను ప్రేక్ష‌కుల‌ను అందించ‌నుంది.

జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేక‌ర్ న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో.. రోహిత్ బ‌న‌వాలిక‌ర్‌, శ్రీరామ్ రాజ‌న్‌తో క‌లిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. గూఢ‌చర్యం, అనిశ్చిత‌మైన వాతావ‌ర‌ణం, ఇంటెలిజెన్స్ వైప‌ల్యంతో పాటు న్యాయం కోసం చెల్లించిన భారీ మూల్యం క‌ల‌బోత‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. అమిత్ సియాల్ – డి.ఆర్. కార్తికేయన్ (ఎస్‌.ఐ‌.టి చీఫ్), సాహిల్ వైద్ – అమిత్ వర్మ (ఎస్‌.పీ-సీబీఐ), భగవతీ పెరుమాళ్ – రాఘవన్ (డి‌.ఎస్‌.పీ-సీబీఐ), డానిష్ ఇక్బాల్ – అమోద్ కాంత్ (డి‌.ఐ‌.జి-సీబీఐ), గిరిష్ శర్మ – రాధావినోద్ రాజు (డి‌.ఐ‌.జి-సీబీఐ), విద్యుత్ గర్గ్ – కెప్టెన్ రవీంద్రన్ (ఎన్‌ఎస్‌జీ కమాండో), శఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శృతి జయన్, గౌరి మీనన్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ జూలై4 నుంచి సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ కాబోతోంది.

Tags:    

Similar News