The kashmir Files : కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'...!

The kashmir files : ఇప్పుడు ఎవరి మాట ఉన్న అందరి నోట వినిపిస్తున్న ఓకే ఒక్క సినిమా ది కశ్మీర్‌ ఫైల్స్‌..

Update: 2022-03-16 14:00 GMT

The kashmir files " ఇప్పుడు ఎవరి మాట ఉన్న అందరి నోట వినిపిస్తున్న ఓకే ఒక్క సినిమా ది కశ్మీర్‌ ఫైల్స్‌.. ప్రతిఒక్కరు దీని గురించే డిస్కషన్.. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.60 కోట్లు రాబట్టింది.

ఈ విషయాన్ని ట్రేడ్‌ గురు తరణ్‌ ఆదర్శ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. మార్చి 11న రిలీజైన ఈ మూవీకి మొదటి రోజు మూడున్నర కోట్లు రాగా, రెండో రోజు రూ.8.50 కోట్లు, మూడో రోజు రూ.15.10 కోట్లు, నాలుగో రోజు రూ.15.05 కోట్లు, ఐదో రోజు(మంగళవారం) ఏకంగా రూ.18 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.60.20 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.. పెద్దగా ప్రమోషన్స్ లేని ఈ సినిమాకి మౌత్ టాక్ పెద్ద ప్రమోషన్ గా మారిపోయింది.

1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించారు వివేక్ అగ్నిహోత్రి.. అనుపమ్‌ ఖేర్‌ మెయిన్ లీడ్ లో నటించగా దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు.

Similar News