The Kashmir Files : ఓటీటీలోకి 'ది కాశ్మీర్ ఫైల్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Kashmir Files : ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'...;
The Kashmir Files : ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'... మార్చి 11న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 250కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది.
ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 90వ దశకంలో కాశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా మే 13నుంచి 'జీ-5'లో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రీ, ఇదే నిర్మాతతో కలిసి 'ది ఢిల్లీ ఫైల్స్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.