రాజకీయాలు సినిమాలను శాసిస్తాయి. స్నేహాలు.. ఆ శాసనాలను అడ్డుకుంటాయి. అవసరమైతే ఎంత దూరమైనా వెళతాయి.. అనేందుకు దేవర కోసం వచ్చిన కొత్త జి.వోనే ఉదాహరణ. మరి ఈ కథ తెలియాలంటే ముందు సితార బ్యానర్ నిర్మాత నాగవంశీ గురించి తెలుసుకోవాలి. అతనికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలి. ఆ ఇష్టమే ఇప్పుడు దేవరకు ఎన్నో ఫెసిలిటీస్ ను తీసుకువచ్చిందనే అసలు నిజం తెలుసుకోవాలి. మరి దేవర సమేత నాగవంశీ కథేంటో చూద్దాం.
ఎవరు ఎన్ని అనుకున్నా.. కొన్నాళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ సెంటర్ పాయింట్ గా కనిపిస్తున్నాడు. అతను డైరెక్ట్ గా ఎలివేట్ కావడం లేదు. కానీ ఇన్ డైరెక్ట్ గా ఇక ఎన్టీఆర్ మనకు వద్దు అని భావించిన సందర్భాలు కూడా కనిపించాయి. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేడు ఎన్టీఆర్ ఇంటి పార్టీ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకూ జరిగిన సంఘటనలెన్నో జూనియర్ ను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టేందుకు కారణం అయ్యాయి. ముఖ్యంగా ఇంటి పార్టీ ఆయన్ని వద్దు అనుకున్నది అనేది అందరికీ తెలిసిన నిజం. ఆ నిజం వల్లే ఇప్పుడు దేవర సినిమాపై ప్రభావం చూపిస్తుందని అంతా భావించారు. ఈ చిత్రానికి ఎలాంటి అదనపు అనుమతులు ఉండవు అనుకున్నారు. అంటే దేవరకు మిడ్ నైట్ షోస్, అదనపు ఆటలు, టికెట్ ధరలు పెంచుకునే లాంటి ఎక్స్ ట్రా ఫెసిలిటీస్ ఏం ఉండవు అనే అనుకున్నారు. అది నిజమే అని ఆ మధ్య కొన్ని సంకేతాలు కూడా వచ్చాయి. అర్థరాత్రి సినిమాల వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడే ఏపిలో దేవర పని ఐపోయినట్టే అనుకున్నారంతా.. అదుగో అప్పుడు ఎంటర్ అయ్యాడు నాగవంశీ.
నాగవంశీ ఎంట్రీతో అన్ని లెక్కలూ మారిపోయాయి. ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న చొరవ కారణంగానే దేవరకు ఇప్పుడు అన్ని అదనపు సౌకర్యాలు తోడయ్యాయి. ఆ కారణంగానే తారక్ మూవీకి ఇప్పుడు మిడ్ నైట్ షోస్ నుంచి ఏకంగా రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునే అనుమతులిస్తూ ఏపి ప్రభుత్వం జివో జారీ చేసింది. ఈ జీవో వెనక అన్నీ తానై ఉన్న ఏకైక వ్యక్తి నాగవంశీ. అతనేం చేశాడు.. ఎలా చేశాడు అనేది పక్కన బెడితే.. ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంతో పాటు గతంలో తమకోసం అతను అండగా నిలబడిన వైనం వరకూ ఉన్నాయి. ఆ సందర్భం అరవింద సమేత వీరరాఘవతో వచ్చింది.
కొన్నాళ్ల క్రితం అజ్నాతవాసితో ఫ్లాప్ అందుకున్న బ్యానర్ కోసం ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. అంతా త్రివిక్రమ్ తో కష్టం అని చెప్పినా.. తను ఆ బ్యానర్ లో అరవింద సమేత చేశాడు. హిట్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ను అన్నగా భావిస్తూ.. వస్తోన్న నాగవంశీకి ఈ సందర్భంతో ఆ ప్రేమ రెట్టింపయ్యింది. ఆ ప్రేమే ఇప్పుడు అన్నకు అండగా నిలిచే వరకూ వచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో కీలకమైన వ్యక్తి కూడా ఉన్నాడు అని హారిక హాసిని బ్యానర్ కు అంకితమైన దర్శకుడికి అత్యంత ప్రియమైన స్నేహితుడు అజ్నాతవాసిలా నిలిచాడు అని వేరే చెప్పక్కర్లేదు. యస్.. పిఠాపురం తాలూకా వారి సపోర్ట్ తో నాగవంశీ చేసిన ప్రయత్నం కారణంగానే దేవర మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం వచ్చింది అని సత్యం. మరి ఈ అవకాశాన్ని సినిమా నిలబెట్టుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే నాగవంశీ ఎఫర్ట్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్ని కృతజ్నతలు చెప్పినా తక్కువే అని కచ్చితంగా చెప్పొచ్చు.