రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు మారుతి. అఫ్ కోర్స్ దీని గురించి ముందుగానే సమాచారం ఇచ్చాడు. అయితే అది ఎలా ఉంటుందా అనే హింట్ లేదు. కొన్నాళ్ల క్రితమే గ్లింప్స్ విడుదల చేశారు కాబట్టి.. ఈ సారి గ్యారెంటీగా టీజర్ వస్తుందని భావించారు. కానీ మారుతి జస్ట్ ఓ మోషన్ పోస్టర్ మాత్రమే వదిలాడు.అయితే ఇదేమంత గొప్పగా లేదు అనే చెప్పాలి. పైగా ప్రభాస్ లుక్ కూడా ఓల్డ్ ఏజ్ తో కనిపిస్తోంది. బర్త్ డే రోజు ఇలాంటి లుక్ చూడ్డం అంటే ఫ్యాన్స్ కు ఇబ్బందే కదా. ఇంతకీ ఈ మోషన్ పోస్టర్ ఏముందీ అంటే..
ఒకానొక పెద్ద అడవి. అందులో ఏవో అదృశ్య హస్తాలు పియానో వాయిస్తుంటాయి. ఈలోగా ఓ వయసు మళ్లిన మనిషి నడుచుుంటూ వెళుతుండగా.. చెట్టు నుంచి ఆకు రాలి పడబోతుండగా పెద్ద చెయ్యి వచ్చి ఆకునే ఆపేస్తుంది. తర్వాత ఓ మాన్షన్ లాంటి ఇల్లు. అందులో రీసెంట్ గా విడుదల చేసిన సింహాసనం లాంటి కుర్చీలో పెద్ద చుట్ట కాలుస్తూ.. కూర్చున్న ప్రభాస్. అతని జుట్టుతో పాటు గెడ్డం కూడా తెల్లగా మారింది. కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ లో తమన్ వాయింపుతో పాటు హ్యాపీ బర్త్ డే టూ యూ అనే మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. ఇదే ఈ మోషన్ పోస్టర్ లో ఉంది. ఇవాళ బర్త్ డే కాబట్టి పెద్దగా కామెంట్స్ రాకపోవచ్చు కానీ.. ఫ్యాన్స్ కూడా దీన్ని మెచ్చుకోరేమో.