చిరంజీవి అడిగితే ఎవరైనా ఎలా కాదనగలరు.. అందుకే ఆ దర్శకుడు..
అడిగింది ఎవరు.. మెగాస్టార్.. అసలే ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవాడు.. ఆయన సినిమాలను డైరెక్ట్ చేయాలనుకుంటున్నవాడు..;
అడిగింది ఎవరు.. మెగాస్టార్.. అసలే ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవాడు.. ఆయన సినిమాలను డైరెక్ట్ చేయాలనుకుంటున్నవాడు.. తాను ఓ సినిమా కోసం తయారు చేసి పెట్టుకున్న టైటిల్.. ఇప్పుడు చిరు అడిగితే ఎలా కాదని చెప్తాడు.. అందుకే మరో మాటకు తావివ్వకుండా సంతోషంగా అంగీకరించాడు సంపత్ నంది.
ఇంతకీ ఏంటా టైటిల్ ఏమా సినిమా అంటే.. మెగాస్టార్ చిరు నటిస్తున్న 'ఆచార్య' సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మరో సినిమా లూసిఫర్ సెట్స్ మీదకు వెళ్లనున్న తరుణంలో టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్న యూనిట్‌కి గాడ్‌ఫాదర్ బావుంటుందని అనిపించింది. అయితే ఆ టైటిల్‌ను ఇదివరకే సంపత్ నంది రిజిస్టర్ చేసుకున్నారు.
ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆ టైటిల్ తమకు కావాలంటూ ఫోన్ వచ్చింది. మెగాస్టార్ కూడా స్వయంగా ఫోన్ చేసి అడిగేసరికి సంపత్ కాదన్లేక పోయారు. చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్ట్ 22న ఈ టైటిల్‌ను అనౌన్స్ చేయాలనుకుంటోంది చిత్ర యూనిట్.