రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాజా సాబ్. ఈ వారంలో విడుదల కాబోతోంది ఈ మూవీ. బట్ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. దర్శకుడు మారుతి సైతం ప్రమోషన్స్ విషయంలో అగ్రెసివ్ గా లేడు. వైవిధ్యమైన హారర్ మూవీతో రూపొందిన సినిమా ప్రమోషన్స్ లో మాత్రం దారుణంగా వెనకబడి పోయింది. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.. కేవలం తెలుగు మూవీగా మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుండటం మారి కోపానికి కారణం. అటు ఇండియా వ్యాప్తంగా కూడా ఈ మూవీ రిలీజ్ విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు కనిపించడం లేదు. మరి ఇన్ని మైనస్ లు కనిపిస్తోన్న మూవీకి సీక్వెల్ అంటే ఆటోమేటిక్ గా నవ్వుకుంటారు కదా జనాలు. పైగా సీక్వెల్ కు పోస్టర్ కూడా యాడ్ చేశారు అంటున్నారు.
ప్రభాస్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది అనేలా ఆ మూవీ ట్రైలర్ లో జోకర్ పోస్టర్ ద్వారా తెలియజేస్తున్నారట. జోకర్ పోస్టర్ ద్వారా అదే ఇండికేషన్ అవుతుందని కూడా చెబుతున్నారు. పైగా ట్రైలర్ లోనే అలా ఇవ్వడం కూడా సీక్వెల్ కు అసలైన కారణం అని చెప్పారు. మొత్తంగా అసలు ప్రమోషన్స్ లోనే మినిమం కనిపించడం సినిమాకు సీక్వెల్ అని కూడా చెప్పడం ఏదైతే ఉందో.. అది మాత్రం దారుణంగా అంటున్నారు. ఒకవేళ సీక్వెల్ ఉంటే మాత్రం ప్రభాస్ నుంచి మరికొన్నేళ్ల పాటు ఆగాల్సి వస్తుంది. ఇప్పటికే సలార్ 2, కల్కి 2 చిత్రాలు వెయిటింగ్ లో ఉన్నాయి. అంటే రాజా సాబ్ 2 కూడా ఉంటుందన్నమాట.