Pooja Hegde : ఆ ముగ్గురు హీరోలతో కలిసి నటించాలని ఉంది : పూజా హెగ్డే..!
Pooja Hegde : అయితే ఇటీవల చెన్నైలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా తన మనసులో మాటని బయటపెట్టింది.
Pooja Hegde : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హేగ్దే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడి మొత్తానికి మార్చి 11న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపొయింది.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ జోరు పెంచేసింది. అయితే ఇటీవల చెన్నైలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా తన మనసులో మాటని బయటపెట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ..రణబీర్ కపూర్, కమల్ హాసన్, ధనుష్ వంటి బిగ్ స్టార్ లతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.
అది తన డ్రీం అని తెలిపింది. అయితే పూజా కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. కాగా రాధేశ్యామ్ చిత్రంలో పూజా హేగ్దే ప్రేరణ అనే పాత్రలో నటిస్తోంది. కాగా రాధేశ్యామ్ చిత్రం మార్చి 11 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.