శుక్రవారం వచ్చిందంటే ఇప్పుడు థియేటర్ లో ఏ మూవీస్ వస్తున్నాయి అనేది చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు థియేటర్స్ లో లాంటి ఎంటర్టైన్మెంట్ ఇంట్లోకి వస్తుంటే ఇంక థియేటర్ లో చూడాల్సిన పనిలేదు కదా. యస్.. కొన్నేళ్లుగా ఓటిటిలో వస్తున్న మూవీస్ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. అలా ఈ వారం వస్తున్న మూవీస్ మాత్రం చాలా స్పెషల్ గా ఉన్నాయి. అలా ఈ నెల 23న విడుదల కాబోతున్న చిత్రాలు మాత్ర స్పెషల్ గా కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అక్కినేని వారి కోడలు శోభిత మూవీ హైలెట్ గా కనిపిస్తోంది.
శోభిత నటించిన మూవీ చీకటిలో. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది ఈ మూవీ. ఈ సినిమా కాన్సెప్ట్ తో కనిపిస్తుంది. పాడ్ కాస్ట్ చేసే ఒక అమ్మాయి.. మరోవైపు వరుసగా హత్యలు.. మరి ఈ హత్యలు నేపథ్యం ఏంటీ.. దానికి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటీ అనేది పాయింట్ తో కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. బాగా ఆకట్టుకునే కంటెంట్ లా కనిపిస్తోంది ఈ మూవీ.
ఇక నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోన్న మూవీ తేరే ఇష్క్ మే. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన మూవీ ఇది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేశాడు. థియేటర్స్ లో ఈ మూవీకి మంచి అప్లాజ్ వచ్చింది. బలమైన కంటెంట్ లా కనిపించింది. కమర్షియల్ గా కూడా పెద్ద విజయం సాధించింది. కాకపోతే తమిళ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో ఈ మూవీకి వసూళ్లు రాలేదు. మరి ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ ఎలా అందుకుంటుందో చూడాలి.
జీ 5లో విడుదలవుతున్న తమిళ్ మూవీ సిరాయ్. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన మూవీ ఇది. ఓ మర్డర్ సస్పెక్ట్ తో చుట్టూ సాగే కథనం విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ మూవీలో. ఆ సస్పెక్ట్ ఖైదీలో ఉంటాడు. అతన్ని పట్టుకునే పోలీస్ గా విక్రమ్ ప్రభు కనిపిస్తాడు. నిజానికి ఆ మిర్డర్ సస్పెక్ట్ చుట్టూ సాగే కథలా ఉంటుంది.. అదే టైమ్ లో అతనిపై కోపం కూడా కనిపిస్తుంది. నిజంగా ఆకట్టుకునే పోలీస్ డ్రామాలా కనిపిస్తుంది ఈ మూవీ. మరి ఈ మూవీ ఓటిటిలో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
జీ 5 లో విడుదలైన మరో మూవీ మస్తీ 4. మస్తీ సిరీస్ లోనే వచ్చిన మూవీ ఇది. పెద్దగా ఆకట్టుకునే కంటెంట్ తో మాత్రం కనిపించలేదు. ముఖ్యంగా అడల్ట్ కామెడీతో రూపొందిన మూవీ ఇది. మిలప్ ఝవేరీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్ శివదాసానీ, వివేక్ ఒబెరాయ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీకి ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
జీయో హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న మూవీ మార్క్. కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన మూవీ ఇది. ఒరిజినల్ గా విడుదలైన టైమ్ లో మాత్రం మిక్స్ డ్ ఒపినీయన్ వచ్చిందీ మూవీపై. ముఖ్యంగా ప్యాన్ ఇండియా స్థాయిలో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. సుదీప్ ఓ సస్పెండెడ్ పోలీస్ లా నటించాడు. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రూపొందిందీ మూవీ. మరి ఈ మూవీకి ఓటిటిలో ఆకట్టుకునే కంటెంట్ గా మారుతుందేమో చూడాలి.