ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హిట్ అనేది బెల్లం లాంటిది. అది వస్తే అంతా చుట్టూ మూగుతారు. లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం ను చూస్తున్నాం కదా. నిన్నటి వరకూ అతన్నెవరూ పట్టించుకోలేదు. ‘క’బ్లాక్ బస్టర్ కాగానే ఇంటికి వచ్చి మరీ అభినందిస్తున్నారు. హిట్ కు ఉండే పవర్ అది. అయితే కిరణ్ లాగానే లేటెస్ట్ గా ఓ కొత్త సోయగం వరుసగా విజయాలు సాధించింది. అందం ఉంది. టాలెంట్ అదనంగా ఉంది.మరి అలాంటి బ్యూటీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే ఇండస్ట్రీలో అందరి చూపూ వారిపైనే ఉంటుంది కదా. బట్ తీరు చూస్తుంటే అలా ఏం కనిపించడం లేదు. ఆ బ్యూటీయే నయన్ సారిక.
నయన్ సారిక ఈ యేడాది గమ్ గమ్ గణేశా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ మూవీ ఎలా ఉన్నా.. కమర్షియల్ గా హిట్ అన్నారు మేకర్స్. అంటే నయన్ కు ఫస్ట్ హిట్ పడ్డట్టే. ఆ తర్వాత ఆయ్ తో అదరగొట్టింది. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అమ్మాయిగా బాగా ఆకట్టుకుంది. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కు అంతా ఫిదా అయ్యారు. ఆయ్ సూపర్ హిట్ అయింది.
ఇక లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర ‘క’తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో సత్యభామ పాత్రలో అద్భుతంగా నటించింది. తన సహజ నటన, సోయగాలు సినిమాకు ఎసెట్ అయ్యాయనే చెప్పాలి. కాస్త చబ్బీగా ఉన్నా.. అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తోన్న ఈ బ్యూటీ హ్యాట్రిక్ విజయాల తర్వాత నెక్ట్స్ లీగ్ లోకి ఎంటర్ కావాలనుకుంటుంది కదా. అంటే ఇంకా పెద్ద రేంజ్ ఉన్న హీరోలతో ఆఫర్స్ పడితే ఆమె రేంజ్ కూడా మారుతుంది. ఇప్పటి వరకూ అలాంటి కబురేం వినిపించలేదు కానీ.. టైర్ టూ హీరోల సరసన సరైన పెయిర్ అనిపించుకునే సత్తా ఉంది తనలో. మరి ఆ సత్తాను టాలీవుడ్ వాడుకుంటే ఖచ్చితంగా అమ్మడికి ప్రమోషన్ వస్తుంది.