Anupama Parameswaran: 'రౌడీ బాయ్స్' కోసం అనుపమ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలిసిపోయింది..!
Anupama Parameswaran: అనుపమ ఇలా నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటుంది అన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.;
Anupama Parameswaran: ఒక హీరోయిన్ ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని పరిమితులు పెట్టుకునే వస్తుంది. కానీ సమయం గడుస్తున్నకొద్దీ ట్రెండ్‌ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ప్రస్తుతం పలువురు హీరోయిన్ల తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు అనుపమ పరమేశ్వరన్. 'రౌడీ బాయ్స్' సినిమాలో అను పాత్రకు పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువగా వినిపిస్తోంది. అనుపమ ఇలా నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటుంది అన్న విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన అనుపమ.. 'అఆ'తో తెలుగులోకి అడుగుపెట్టింది. ముందుగా తాను తెలుగులో నటించిన రెండు చిత్రాల్లోను తాను సెకండ్ హీరోయిన్‌గానే కనిపించింది. శర్వానంద్‌తో చేసిన 'శతమానం భవతి' సినిమా తనను హీరోయిన్‌గా మార్చింది. అప్పటినుండి రామ్, నాని, సాయి ధరమ్ తేజ్‌లాంటి పలువురు యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.
తెలుగులో ఇన్ని సినిమాలు చేసినా కూడా అనుపమ ఎప్పుడూ ఒక పక్కింటి అమ్మాయి పాత్రలతోనే అలరించింది. అలాంటిది రౌడీ బాయ్స్‌తో అనుపమ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో హీరో ఆశిష్‌తో లిప్‌లాక్‌లు, కాస్త ఎక్స్‌పోజింగ్ చేయడం లాంటివి తన ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాయి. అయితే మరికొందరు మాత్రం అనుపమను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
రౌడీ బాయ్స్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి అనుపమ లిప్‌లాక్‌పై సోషల్ మీడియా మీమ్స్ మొదలయ్యాయి. అందులో అన్నింటికంటే ఎక్కువగా తన రెమ్యునరేషన్ గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇలా యాక్ట్ చేయడానికి అనుపమ.. ఏకంగా రూ.50 లక్షల పారితోషికం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు తాను చేసిన సినిమాల్లో అనుపమ ఇంతకంటే తక్కువే ఛార్జ్ చేసిందని టాక్.