Sita Ramam Movie : సీతారామంకి మూడేళ్లు

Update: 2025-08-05 08:15 GMT

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ‘సీతారామం’. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన సీతారామం ఈ డెకేడ్ లోనే వచ్చిన ప్యూరెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా ఎపిక్ అనిపించుకుంది. ఓ క్లాసిక్ గా తెలుగు చిత్ర సీమలో పేరు తెచ్చుకుంది. అద్భుతమైన కథ, కథనాలు, అంతకు మించిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, నేనేం తక్కువా అన్నట్టుగా కనిపించిన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, సాంగ్స్.. వెరసి సీతారామంను ఓ కళాఖండంగా మార్చాయి. ప్రతి ఎపిసోడ్ హైలెట్ గానే కనిపిస్తుందీ సినిమాలో. క్లైమాక్స్ విషాదాంతం అయినా.. ప్రేక్షకులు దాన్ని అంగీకరించేలా చేయడంలో దర్శకుడు హను రాఘవపూడి సూపర్ సక్సెస్ అయ్యాడు.

ప్రధాన జంటగా దుల్కర్, మృణాల్ అత్యంత సహజంగా కనిపిస్తే.. కీలకమైన పాత్రలో రష్మిక మందన్నా అదరగొట్టింది. పాకిస్తానీ రెబల్ అమ్మాయిగా తన పాత్ర మొదలైన విధానం, ఎండ్ అయిన విధానం ప్రేక్షకుల హృదయాలకు బలంగా తాకింది. ఆశ్చర్యకరమైన పాత్రలో సుమంత్ మరోసారి మెప్పించాడు. తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్, వెన్నెల కిశోర్, ప్రకాష్ రాజ్, శతృ, సచిన్ ఖేద్కర్.. ఇలా ఎవరికి వారు ఓన్ చేసుకుని నటించారా అన్నట్టుగా కనిపిస్తుందీ మూవీ. అందుకే ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా .. ఇంకా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాగా ఎవర్ గ్రీన్ అనిపించుకున్న సీతారామం విడుదలై ఇవాళ్టికి 3యేళ్లు. మరో 30యేళ్లైనా ఈ మూవీ ఆకట్టుకుంటూనే ఉంటుందని చెప్పొచ్చు.

 

Tags:    

Similar News