Thug Life : థగ్ లైఫ్ .. ఆ ఇద్దరూ తప్పించుకున్నారు

Update: 2025-06-06 10:48 GMT

కొంతమంది నటులు, దర్శకులతో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తారు యంగ్ స్టర్స్. అందుకోసం వారు అడిగిన వెంటనే ఎస్ చెప్పేస్తుంటారు ఆ పాత్రలకు. కొన్నిసార్లు కొందరికి ముందే ‘అలారం’మోగుతుంది. అయినా మొహమాటానికి అలాగే ఉండిపోతారు. అలా ఉండిపోయే ఇప్పుడు థగ్ లైఫ్ లోచేసిన పాత్రకు ఫీల్ అవుతున్నాడు శింబు. అతనితో పాటు త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మిలదీ అదే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఇద్దరు స్టార్స్ మాత్రం తెలివిగా తప్పించుకోగలిగారు. అంటే మారు ఈ రిజల్ట్ ను ముందే గెస్ చేశారా లేక ఇంకేదైనానా అనేది చెప్పలేం కానీ.. వాళ్లైతే తప్పించుకున్నారు.

ఈ సినిమాలో శింబు చేసిన పాత్రకు ముందుగా అనుకున్నది దుల్కర్ సల్మాన్ ను. అలాగే అశోక్ సెల్వన్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు జయం రవి(రవి మోహన్ గా పేరు మార్చుకున్నాడు) ను అనుకున్నారు. అలాగే జోజూ జార్జ్ చేసిన పాత్ర కోసం పంకజ్ త్రిపాఠి పేరు వేశారు. ఈ మేరకు అప్పట్లో అనౌన్స్ మెంట్ పోస్టర్స్ కూడా వేశారు. త్రిష అప్పుడూ ఉంది. ఇక దుల్కర్, రవి మోహన్ పాత్రలు రెండు సినిమాలో బలహీనంగానే ఉన్నాయి. ఒకవేళ ఆ ఇద్దరూ ఈ రెండు పాత్రలు చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ.. శింబు మాత్రం సినిమా ఆసాంతం మొహమాటానికి ఒప్పుకున్నాను అనే ఎక్స్ ప్రెషన్ తోనే కనిపించాడు. అశోక్ సెల్వన్ పాత్రకు గ్రాండ్ గా పరిచయం చేసి తుస్సుమనిపించారు. ఉన్నంతలో జోజూ జార్జ్ కు బలమైన రోల్ దక్కింది. ఐశ్వర్య లక్ష్మిది గెస్ట్ రోల్ అనే చెప్పాలి.

మొత్తంగా దుల్కర్, రవి మోహన్ ఇద్దరూ బలే తప్పించుకున్నారీ డిజాస్టర నుంచి. 

Tags:    

Similar News