మానుషి చిల్లర్.. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన బ్యూటీతో కుర్రాళ్ల మదిని దోచుకున్న ఈ చిన్నది తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం హిట్ కాకపోయినా కూడా ఈ అమ్మడికు వరుసగా చాన్స్ లు వచ్చాయి. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో యంగ్ హీరో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో అంతగా అవ కాశాలు రాలేదు ఈ చిన్నదానికి. హిందీలో ఇటీవల విడుదలైన బడే మియాస్ చోటే మియాస్ బాగా రాణించలేదు, కానీ ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మానుషి 'మాలిక్' మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా సొగసైన తెల్లటి ఎంబ్రాయిడరీ డ్రెస్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అందులో ముద్దుగుమ్మ మరింత ప్రకాశవంతంగా, అందంగా కనిపించింది. ముత్యపు చోకర్, మృదువైన కర్స్ లుక్ తో రాయల్ టచ్ను జోడించింది. ఆ ఫొటోలకు 'నేనే, టైమ్ మెషిన్, & చాలా ఎక్కువ హెయిర్రో' అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.