Aditi Gautam : టైమ్ లెస్ గ్రేస్.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న అదితి

Update: 2025-06-13 11:15 GMT

'నేనింతే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ మైన భామ శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వేదం, పక్కా కమర్షియల్, అతిథి వెబ్ సిరీస్లోనూ ఆకట్టుకుంది. కోలీవుడ్ లో డబుల్ డెక్కర్ తో పాటు 'సంజు' మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి మెస్మరైజ్ చేసింది. తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి అందం, గ్లామర్ తో సౌతిండియాలో తనదైన స్థానాన్ని ఏర్పరచు కుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సడెన్ గా సినిమాలకు దూరమైంది. అయితే మూవీ చాన్స్ లు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఎప్పటికప్పడు తన ఫ్యాషన్ స్టయిల్ ఫొటోలు, పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఎర్ర చీరలో మెరిసిపోతున్న పిక్స్ ను ఇన్స్టాలో షేర్చేసింది అదితి. తెల్లటి పూల డిజైన్ల రెడ్ శారీలో సిల్వర్మ్కీలు, సాఫ్ట్ లైటింగ్ లో బీచ్ దగ్గర నిలబడి కిల్లింగ్ లుక్ తో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ ఫొటోలకు 'టైమ్స్ గ్రేస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ గాడ్ఆప్టెడ్, సో బ్యూటిఫుల్, మెస్మ రైజింగ్ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ అదితిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News