Dahan Web Series : టిస్కా చోప్రా 'దహన్' వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
Dahan Web Series : టిస్కా చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దహన్’ రిలీజ్ డేట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అనౌన్స్ చేశారు.
Dahan Web Series : టీసా చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'దహన్'. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 16న డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయింది. వెబ్ సిరీస్‌లు, ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు థియేటర్లోని సినిమాలకు పెద్ద సవాల్‌నే విసురుతున్నాయి. తాజా రిలీజ్ అయిన లైగర్ ఫ్లాప్‌కు కారణం కూడా ఓటీటీ లాంటి కంటెంట్ ఇవ్వలేకపోవడమని చార్మీ మీడియా ముందు అంగీకరించారు. పూర్తి సస్పెన్స్, హారర్, మిస్టరీ జానర్‌లో దహన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనుంది.