అమెరికా అధ్యక్షుడిపై టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు
Tollywood: యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు.;
యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద నిఖిల్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు.. ఇప్పుడు ఇలా పారిపోయారు. ఇంకెప్పుడైనా ఫ్రీడం గురించి మాట్లాడితే.. అంటూ అమెరికా అధ్యక్షుడిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. నిఖిల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆదేశంలో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పరిస్థితికి కారణం అమెరికానే అని ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. ఇన్నేళ్లు ఆఫ్ఘానిస్తాన్‌లో తన సైన్యాన్ని ఉంచిన అమెరికా ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకుంటోంది. ఆగస్ట్ 31 వరకు మిగిలిన సైనికులందరినీ సైతం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. అమెరికా సైన్యం వెనక్కి వెళుతుండడంతో అక్కడ తాలిబన్ల అరాచకం మొదలైంది. దాంతో నిఖిల్ తన ఆక్రోశాన్ని కంట్రోల్ చేసుకోలేక సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడిని తిట్టి పడేశాడు.