Poonam Kaur: ఆయన గెలిస్తే.. అసలు నిజాలు బయటపెడతా! పూనమ్ కౌర్ కామెంట్
Poonam Kaur: మా ఎన్నికలు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.;
Poonam Kaur: మా ఎన్నికలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అధ్యక్ష పదవి కోసం తలపడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లు ఇద్దరు తెలివిగా పావులు కదుపుతున్నారు. అయితే మా ఎన్నికల కోసం వీరు చేస్తున్న ప్రచారం మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో వీరికి వస్తున్న సపోర్ట్ కూడా ఎవరు విజేత అని డిసైడ్ చేస్తుంది. అలా చూస్కుంటే ప్రస్తుతం ప్రకాశ్ రాజ్‌కే ఇండస్ట్రీలోని ప్రముఖుల దగ్గర నుండి సపోర్ట్ లభిస్తోంది.
పైగా వీరికి పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన బండ్ల గణేష్ కూడా పోటీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ చేస్తూ ఓ యంగ్ బ్యూటీ సంచలన కామెంట్‌ను చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పూనమ్ కౌర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండే హీరోయిన్.
ఈ నటి ఇటీవల ప్రకాశ్ రాజ్‌తో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ మా ఎన్నికల్లో ఆయనే గెలవాలి అని కోరుకుంటున్నాను అని మనసులోని మాట బయటపెట్టారు. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. మరి నిజంగానే ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా గెలిస్తే పూనమ్ ఏ విషయాలను బయటపెట్టనుండి?
ఇండస్ట్రీలోని ఎంతమందిపై పూనమ్ ఆరోపణలు చేయనుంది? అనే అంశాలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. పూనమ్ కౌర్, ప్రకాశ్ రాజ్ కలిసి పలు సినిమాల్లో కలిసి నటించారు. చివరిగా శ్రీనివాస కళ్యాణం అనే చిత్రంలో వీరిద్దరు తండ్రికూతుళ్లుగా కనిపించారు.