Karthikeya- Lohitha Wedding Card: పెళ్లి ఫిక్స్.. వైరల్‌గా మారిన వెడ్డింగ్ కార్డ్..!
Karthikeya- Lohitha Wedding Card: RX100 సినిమాతో వచ్చి ఒక్కసారిగా టాలీవుడ్‌ని షేక్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ..;
Karthikeya- Lohitha Wedding Card: RX100 సినిమాతో వచ్చి ఒక్కసారిగా టాలీవుడ్‌ని షేక్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా రాజావిక్రమార్క అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలావుండగా తన స్నేహితురాలైనన లోహితను ప్రేమించి త్వరలో పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. 'రాజా విక్రమార్క' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తనకి కాబోయే భార్య లోహితకు ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా కార్తికేయ, లోహిత పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ఇద్దరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే లోహిత, కార్తికేయ నిశ్చితార్థపు వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.