Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం

Update: 2025-01-21 09:15 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా తాను ప్రేమించిన హీరోయిన్ రహస్య గోరక్‌ను కిరణ్ గత ఆగస్టులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

‘రాజావారు.. రాణిగారు’ (2019)తో కిరణ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. గతేడాది ఆగస్టులో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘క’తో కిరణ్‌ అబ్బవరం సూపర్‌హిట్‌ను అందుకున్నారు.

Tags:    

Similar News