'మిథునం' చిత్ర రచయిత కన్నుమూత

ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు.

Update: 2023-07-19 04:37 GMT

ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.. ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు తుది శ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో దిగ్గజాలైన బాపు, రమణలతో కలిసి ఆయన పని చేశారు. నవ్య వారపత్రికకు ఎడిటర్ గా పని చేశారు.

2012లో విడుదలైన మిథునం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవడం తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం. పేరడీ రచనలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరమణ శ్రీ కాలమ్, శ్రీ ఛానెల్, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలి రేకులు వంటి సీరియల్స్ కు పని చేశారు.

25 సంవత్సరాల క్రితం శ్రీరమణ రచించిన మిథునం కథను ప్రముఖ దర్శకుడు, నిర్మాత,నటుడు అయిన తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మి ఆయా పాత్రలకు జీవం పోశారు. శ్రీరమణ మృతిపై పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News