టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ (54) ఇవాళ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని నెలలుగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంలో తుదిశ్వాస విడిచారు. వేదరాజు అల్లరి నరేశ్తో మడత కాజా, సంఘర్షణ సినిమాలను తెరకెక్కించారు. అల్లరి నరేష్ తో మడతకాజా, సంఘర్షణ సినిమాలు తీశారు. ఇందులో మడతకాజా సూపర్ హిట్ కాగా.. సంఘర్షణ ఆకట్టుకోలేదు. నెక్స్ట్ ప్రొడక్షన్ వెంచరు ప్లాన్ చేస్తుండగా ఆయన మృత్యువాత పడటంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. వేదరాజు కు భార్య, కూతురున్నారు. వేదరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయింత్రం జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.