Durandhar 2 : దురంధర్ 2 ను ఢీ కొట్టే దమ్ముందా టాక్సిక్ కి

Update: 2026-01-19 08:25 GMT

దురంధర్ బాలీవుడ్ ను షేక్ చేసింది. ఈ మూవీ అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. వైవిధ్యమైన కథ, కథనాలతో కాసులు కూడా కొల్లగొట్టింది. ఏకంగా 1000 కోట్ల వరకూ వసూలు చేసింది. అంతకు మించి ఈ చిత్రానికి రెండో భాగం కూడా ఉండబోతోంది అని గతంలోనే చెప్పారు. రెండో భాగం అనగానే సౌత్ మేకర్స్ లాగా యేళ్ల తరబడి కాకుండా ఇమ్మీడియెట్ గా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. దురంధర్ గతేడాది డిసెంబర్ 5నే విడుదలైంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ను వెంటనే ఈ మార్చి 19న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. అంటే చాలా తక్కువ టైమ్ లోనే విడుదల కాబోతోంది. మరి ఆ డేట్ కు ఆల్రెడీ రిలీజ్ డేట్ వేసింది టాక్సిక్. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ హీరోగా నటించిన మూవీ టాక్సిక్. ఆ చిత్రంతో పోటీ పడాలని క్లియర్ గా డిసైడ్ అయింది దురంధర్ 2. ఈ మేరకు రెండు సినిమాల డేట్స్ లో అస్సలు ఏ మార్పులూ ఉండవు అని తేల్చి చెబుతున్నారు.

టాక్సిక్ విషయంలో యశ్ చాలాకాలం తర్వాత స్టార్ట్ చేశాడు. ఈ మూవీని గతేడాదే విడుదల చేయాలనుకున్నారు. బట్ లేట్ అయింది. అందుకే ఈ మార్చి 19న విడుదల చేయాలనుకున్నారు. రీసెంట్ గా యశ్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన టీజర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. ఈ రేంజ్ మేకింగ్, టేకింగ్, సీన్స్ ను దర్శకురాలు గీతా మోహన్ దాస్ నుంచి ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఆ కారణంగా ఈ మూవీపై భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అటు చూస్తే ఆల్రెడీ దురంధర్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ కారణంగా ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో విడుదల చేశారు. బట్ ఈ సారి మాత్రం అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఓ రకంగా ఆ కారణంగానే రిలీజ్ లేట్ అయిందేమో. మొత్తంగా టాక్సిక్ ముందు చాలా పెద్ద సవాల్ ఉండబోతోంది. దురంధర్ 2 తో పాటు పోటీ పడటం అనేది గ్యారెంటీగా ఆ మూవీకి రిస్కే. అయినా ఆ రిస్క్ ను ఫేస్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ రావడం పెద్ద విషయమే. మరి ఈ రెండు సినిమాల పోటీ మాత్రం ఇప్పుడు క్లియర్ గా సెట్ అయింది. మరి ఈ రెండు సినిమాల్లో దేనికి ప్రేక్షకులు ఎక్కువగా ఓటు వేస్తారు అనేది చూడాలి. 

Tags:    

Similar News